రికార్డ్‌ బ్రేక్‌

ABN , First Publish Date - 2020-08-03T09:42:21+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ మరింత దూసుకుపోతున్నది. ఆదివారం రికార్డు స్థాయిలో 1,227 మందికి వైరస్‌ నిర్ధారణ ..

రికార్డ్‌ బ్రేక్‌

జిల్లాలో మరో 1,227 మందికి కరోనా వైరస్‌ 

ఒక్క రోజుల్లో నమోదైన కేసుల్లో అత్యధికం

వరుసగా రెండో రోజూ వేయికిపైగా  కేసులు నమోదు

13,559కి చేరిన బాధితులు


విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ మరింత దూసుకుపోతున్నది. ఆదివారం రికార్డు స్థాయిలో 1,227 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. గత నెల 30వ తేదీన నమోదైన అత్యధిక కేసుల(1,223) రికార్డును అధిగమించింది. కాగా వరుసగా రెండో రోజూ వేయికిపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 13,559 మంది వైరస్‌బారిన పడ్డారు. వీరిలో 4,531 మంది కొలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 8,930 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. వీటితో కలిపి కొవిడ్‌ మరణాల సంఖ్య 98కు చేరింది. 


నర్సీపట్నంలో 23 మందికి పాజిటివ్‌  

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో ఆదివారం 23 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. బొంతువీధిలో ఇద్దరు వ్యక్తులు(47, 56), వెంకునాయుడుపేటలో మహిళ (55), వ్యక్తి(60), కోమటివీధిలో వ్యక్తి(55), శివపురంలో ముగ్గురు వ్యక్తులు(31, 39, 56), ఇద్దరు మహిళలు(38, 47), ఐదు రోడ్ల కూడలిలో వ్యక్తి(26), రామారావుపేటలో వ్యక్తి(40), మహిళ(27), వెలమ వీధిలో వ్యక్తి(52), అయ్యన్నకాలనీలో మహిళ(38), మోర్‌ సమీపంలో బాలిక(16), రెల్లి వీధిలో వృద్ధురాలు(81), పెదబొడ్డేపల్లిలో ఇద్దరు వ్యక్తులు(32, 34), మహిళ(32), పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోని నిఘా విభాగం ఉద్యోగి(57), జోగినాథునిపాలెంలో మహిళ(32), 24వ వార్డులో యువకుడు(26) వైరస్‌ బారిన పడ్డారు. 


అనకాపల్లిలో 15 కేసులు

అనకాపల్లిలో ఆదివారం 15 కరోనా కేసులు నమోద య్యాయి. వీరిలో పట్టణానికి చెందిన నలుగురు(25, 35 55, 40),  మిరియాల కాలనీలో మహిళ(55), నెయ్యిలవీధిలో మహిళ(58), చిన్నవీధిలో  వ్యక్తి(40) వుడ్‌పేటలో వృద్ధుడు(75), గవరపాలెంలో ముగ్గురు వ్యక్తులు(24, 42, 48), శ్రీరామ్‌నగర్‌లో వ్యక్తి(35) వైరస్‌ బారిన పడ్డారు.  సత్యనారాయణపురంలో వ్యక్తి(49), తుమ్మపాలలో ఇద్దరు వ్యక్తులు(39, 39)లకు కరోనా సోకింది. 


దేవరాపల్లి మండలంలో పది...

దేవరాపల్లి మండలంలో ఆదివారం పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేవరాపల్లిలో ఐదుగురికి, కేఎం.పాలెంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధ్దారణ అయిందని పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్‌.లలిత తెలిపారు. కొత్తపెంట, ఎం.అలమండ, కలిగొట్ల, మామిడిపల్లిలో ఒక్కొక్కర చొప్పున వైరస్‌బారిన పడినట్టు వేచలం పీహెచ్‌సీ వైద్యాధికారి బి.హారిక తెలిపారు.  


చ్యుతాపురంలో పది కేసులు....

అచ్యుతాపురం మండలంలో ఆదిరవారం పది పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయని వైద్యాధికారిణి ఆడారి కనకమహాలక్ష్మి తెలిపారు. పూడిమడకలో ఒకే కుటుంబానికి చెందిన 72 ఏళ్ల వయసుగల ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, 13 ఏళ్ల బాలిక, రామన్నపాలెంలో ఒక యువకుడు(25), ఒక మహిళ(27), కుమారపురంలో ఇద్దరు పురుషులు(33, 27), ఇరువాడలో ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌(33) వైరస్‌బారిన పడ్డారు. 


ఇద్దరు వైద్యులతో సహా తొమ్మిది మందికి కరోనా

అరకులోయ మండలంలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతోసహా ఏజెన్సీలో ఆదివారం తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఏజెన్సీ వ్యాప్తంగా 177 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో తొమ్మిది.. 

ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో ఆదివారం 91 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ముగ్గురు ఆరిలోవ, మిగిలినవారిలో గుడ్లవానిపాలెం, సాగర్‌నగర్‌, విశాలాక్షినగర్‌, జోడుగుళ్లపాలెం తదితర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. 


కోటపాడు మండలంలో ఆరు..

కె.కోటపాడు మండలంలోని మూడు గ్రామాల్లో ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. కె.కోటపాడులో ఇద్దరు, ఎ.భీమవరంలో ఇద్దరు, గుల్లేపల్లిలో ఒకరు, ఎ.కోడూరులో వలంటీర్‌(25) వైరస్‌బారిన పడ్డారు.


కశింకోట మండలంలో ఐదు....

 కశింకోట పీహెచ్‌సీ పరిధిలో ఆదివారం ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. కశింకోట గవరపేటలో పోలీసు కానిస్టేబుల్‌(32), కనకమహాలక్ష్మి వీధిలో వ్యక్తి(44), వెదురుపర్తిలో యువకుడు(22), బయ్యవరంలో వ్యక్తి(40), తేగాడలో యువకుడు(33) వైరస్‌ బారిన పడినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజశేఖర్‌ తెలిపారు. 


సబ్బవరంలో ఐదు..

సబ్బవరం మండలంలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎల్లుప్పి శివారు మర్రిపాలెంలో వ్యక్తి(34), బాటజంగాలపాలెంలో యువతి(26), మరో వ్యక్తి(36), సబ్బవరంలో ఒకరు, సాలాపువానిపాలెంలో వృద్ధురాలు(59) వైరస్‌ బారినపడ్డారు.


 చోడవరంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు...  

చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు పోలీస్‌ కానిస్టేబుళ్లకు ఆదివారం కరోనా సోకింది. అనారోగ్యంతో వున్న వీరికి పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ఆదివారం పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి.  


రావికమతం మండలం మేడివాడలో ఆటో డ్రైవర్‌(27)కు కరోనా సోకింది. శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో కొవిడ్‌ పరీక్షలు జరపుకోగా, వైరస్‌ బారిన పడినట్టు  శనివారం రాత్రి సమాచారం వచ్చిందని పీహెచ్‌సీ వైద్యాధికారి టీవీఎస్‌ నాయుడు తెలిపారు.


అనంతగిరి మండలం కాశీపట్నంలో 60 ఏళ్ల మహిళ కరోనావైరస్‌బారిన పడ్డారు. ఈమెను పాడేరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు.


ఎలమంచిలి మండలం బయ్యవరంలో 50 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌బారిన పడినట్టు  రేగుపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటరత్నం తెలిపారు. ఆయన ఉద్యోగరీత్యా అనకాపల్లిలో ఉంటున్నారు.


వేపగుంటలో పారిశుధ్య కార్మికుడు(36) కరోనా వైరస్‌బారిన పడ్డాడు. ఇతనిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

Updated Date - 2020-08-03T09:42:21+05:30 IST