బాధితులు కనిపించడం లేదు

ABN , First Publish Date - 2020-08-08T10:12:07+05:30 IST

జిల్లాలో కరోనా బాధితులు కనిపించడం లేదు. ఈ విషయం ప్రస్తుతం యంత్రాంగంలో కలవరం పుట్టిస్తోంది.

బాధితులు కనిపించడం లేదు

200 కిపైగా చిరునామాలు గల్లంతు

ఆచూకీ కోసం కసరత్తు


ఒంగోలు(క్రైం), ఆగస్టు 7: జిల్లాలో కరోనా బాధితులు కనిపించడం లేదు. ఈ విషయం ప్రస్తుతం యంత్రాంగంలో కలవరం పుట్టిస్తోంది. పరీక్షల సమయంలో ఇచ్చిన చిరునామాల్లో అనేకమంది దొరకకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఫోన్‌ నంబర్లు మూగబోవడంతో పాటుగా వారికి పాజిటివ్‌ రావడం మరింత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో 70వేలకుపైగా కరోనా పరీక్షలు చేస్తే వారిలో 300కుపైగా అడ్ర్‌సలు గల్లంతయ్యాయి. అయితే వీరిలో 200మందికిపైగా పాజిటివ్‌ నిర్ధారణ కావడం, వారు ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం సమస్యగా మారింది.


ఆధార్‌ నంబర్లు సక్రమంగా లేవు. దీంతో అలాంటి వారిపై వైద్యారోగ్య, పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. వారు ఎక్కడ ఉన్నారు, చికిత్స చేయించుకుంటున్నారా లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితులు చికిత్సపొందకుండా ప్రజల్లో తిరిగితే ఎక్కువమందికి కరోనా ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో భారీగా నష్టం జరుగుతుందని వైద్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌తో చిరునామా గుర్తించే పనిలో యత్రాంగం నిమగ్నమైంది. వలంటీర్ల ద్వారాచిరునామాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


కరోనాకు భయపడొద్దు.. డాక్టర్‌ జాన్‌ రిచర్డ్స్‌, కొవిడ్‌ నోడలాఫీసర్‌, రిమ్స్‌

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో కొంతమంది కరోనా నిర్ధారణ పరీక్షల సమయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా పాజిటివ్‌ నిర్ధారణ అయితే వారిని గుర్తించడం కష్టంగా మారింది. కొంతమంది  ఆధార్‌, ఫోన్‌నంబర్లు తప్పుగా నమోదు చేసుకుంటున్నారు. అలాగే చేస్తే అఽధికంగా కరోనా ప్రబలే అవకాశం ఉంది.


Updated Date - 2020-08-08T10:12:07+05:30 IST