పాజిటివిటీ పైపైకి

ABN , First Publish Date - 2020-09-05T08:39:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ నానాటికీ పెరిగిపోతోంది.

పాజిటివిటీ పైపైకి

రాష్ట్రంలో కొత్త కేసులు 10,776.. మరో 76 మంది బలి 

రెండు వారాల క్రితం 9.27

ఇప్పుడు 12.02గా పాజిటివిటీ 

దేశవ్యాప్తంగా 8.43 మాత్రమే 

మొత్తం పాజిటివ్‌లు 4,76,506

4,276కు చేరిన కరోనా మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ నానాటికీ పెరిగిపోతోంది. రెండు వారాల క్రితం ఇది 9.27గా నమోదు కాగా, ఇప్పుడు 12.02కు చేరింది. ప్రస్తుతం మనకంటే ముందు స్థానంలో మహారాష్ట్ర(19.25) ఉంది. ఆ తర్వాత కర్ణాటకలో 11.85, తమిళనాడులో 8.83, తెలంగాణలో 8.65 పాజిటివిటీ రేటు ఉండగా, దేశ వ్యాప్తంగా 8.43 మాత్రమే నమోదైంది. కరోనా కేసుల్లోనూ ఏపీ దూసుకుపోతోంది. పది రోజుల నుంచి వరుసగాపది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం 59,919మందికి పరీక్షలు నిర్వహించగా 10,776 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 4,76,506కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 12,334 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 3,70,613 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,02,067 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 9మంది చొప్పున, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 8మంది చొప్పున, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 76మంది మృతిచెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 4,276కు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో మరో 1,405మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 64,305కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో గడిచిన 24గంటల్లో 702మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇక్కడ మొత్తం కేసులు 47,573కు, మరణాలు 389కి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 927, గుంటూరులో 808, అనంతపురంలో 750, చిత్తూరులో 745, కడపలో 727, విశాఖలో 660, శ్రీకాకుళంలో 638, కృష్ణాజిల్లాలో 378 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. 

Updated Date - 2020-09-05T08:39:23+05:30 IST