గ్రామాల్లోనూ కరోనా..!

ABN , First Publish Date - 2020-08-03T09:59:08+05:30 IST

కరోనా మహమ్మారి గ్రామాల్లోనూ విస్తరించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్‌ నమోదవుతున్న బాధితులను ఎక్కువ లక్షణాలుంటే..

గ్రామాల్లోనూ కరోనా..!

కరోనా మహమ్మారి గ్రామాల్లోనూ విస్తరించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్‌ నమోదవుతున్న బాధితులను ఎక్కువ లక్షణాలుంటే  కొవిడ్‌ సెంటర్‌కు, తక్కువ లక్షణాలుంటే హోం క్వారంటైన్‌కు అధికారులు రిఫర్‌ చేస్తున్నారు. బాధిత గ్రామాల్లో పర్యటిస్తూ కంటైన్మెంట్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. 


పాతపట్నంలో 41 మందికి పాజిటివ్‌ 

నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు


పాతపట్నం, ఆగస్టు 2: మండలంలో వివిధ గ్రామాల్లో 41 మందిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఆదివారం గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎం.కాళీ ప్రసాద్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి దుకాణం తెరిచిన యజమానికి రూ.5 వేలు అపరాధ రసుం విధించినట్లు చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ని యంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసే కంట్రోల్‌రూం పర్యవేక్ష ణాధికారిగా తాను, అలాగే సచివాలయాల్లో  కంట్రోల్‌ రూంకు నియంత్రణ అధికారిగా ఎంపీడీవో వ్యవహరిస్తారని చెప్పారు.


మండలంలో ఎనిమిది..

మెళియాపుట్టి: మండలంలో ఆదివారం ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీటీ బి.ప్రసాదరావు తెలిపారు. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించారు. ఫ జలుమూరు: మండలంలో ఆదివారం 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల కొవిడ్‌ ప్రత్యేకాధికారి కె.రాజగోపాలరావు తెలిపారు. ఒక గ్రామంలో 3, మరో నాలుగు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించామన్నారు. వీరందరికీ హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మరో గ్రామంలో కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న మహిళకు హోం క్వారంటైన్‌లో సదుపాయాలు లేకపోవడంతో సంతబొమ్మాళి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించామన్నారు.


మరో గ్రామం లో ఒక వ్యక్తికి ఆక్సిజన్‌ శాతం తగ్గి బాధపడుతుండడంతో అంబు లెన్స్‌లో రాగోలు జెమ్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఫ వజ్రపుకొత్తూరు: గోవింద పురం పీహెచ్‌సీలో ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో రెండు కరోనా పాజి టివ్‌  కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ నారాయణమూర్తి తెలిపారు. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. ఫ ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో ఆది వారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయని ఇన్‌ చార్జి తహసీల్దార్‌ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాం తాల్లో కరోనా నివారణకు చర్యలు చేపట్టి నట్టు వివరించారు. ఫ రణస్థలం: మం డలంలో ఆదివారం 27 మందికి కరోనా పాజిటివ్‌ సోకినట్లు ఆర్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.


మరో గ్రామంలో కంటైన్మెంట్‌ 

రేగిడి: మండలంలో ఐదు గ్రామాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలు అమలులో ఉండ గా ఆదివారం  మరో గ్రామంలో కంటైన్మెం ట్‌ జోన్‌గా గుర్తించినట్లు ఈవోపీఆర్డీ ప్రభా కరరావు తెలిపారు. ఈ గ్రామంలో గతంలో  మూడుకేసులతో పాటు రెండు రోజుల్లో  మరో ముగ్గురికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలు నిషేధించినట్లు చెప్పారు. స్వీయనియంత్రణ ఒక్కటే మార్గం అని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-08-03T09:59:08+05:30 IST