48.19 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

ABN , First Publish Date - 2020-06-03T20:26:51+05:30 IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పేషెంట్ల రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా రికవరీ పేషెంట్ల శాతం..

48.19 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పేషెంట్ల రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా రికవరీ పేషెంట్ల శాతం 48.19గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కోవిడ్-19 కేసులు 2,07,615కు చేరుకున్నట్టు పేర్కొంది. వీరిలో 1,01,497 యాక్టివ్ కేసులు ఉండగా, 5,815 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కొత్తగా 8,909 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 217 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారంనాడు వెల్లడించింది.


కేసుల నమోదులో ఏడో స్థానంలో భారత్

సరిగ్గా 15 రోజుల క్రితం లక్ష కరోనా కేసులు ఉన్న ఇండియాలో మంగళవారంనాటికి కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో ఇండియా ఏడో స్థానానికి చేరింది.

Updated Date - 2020-06-03T20:26:51+05:30 IST