కరోనా ఉగ్రరూపం.. అమెరికా అతలాకుతలం... సెకనుకు తొమ్మిది పాజిటివ్ కేసులు., ఒక్క‌రోజులో ఆసుపత్రిపాలైన 1.32 ల‌క్ష‌ల మంది.

ABN , First Publish Date - 2022-01-12T00:32:15+05:30 IST

అమెరికాలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు 13 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లంలొ తీవ్ర ఆందోళ‌న నెలకొంది.

కరోనా ఉగ్రరూపం.. అమెరికా అతలాకుతలం...    సెకనుకు తొమ్మిది పాజిటివ్ కేసులు.,  ఒక్క‌రోజులో ఆసుపత్రిపాలైన 1.32 ల‌క్ష‌ల మంది.

న్యూయార్క్ :  అమెరికాలో క‌రోనా కేసులు  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు 13 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లంలొ తీవ్ర ఆందోళ‌న నెలకొంది. కేసులు పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది. కరోనా చికిత్స కోసం నిన్న(సోమ‌వారం) 1.32 ల‌క్ష‌ల మంది ఆసుప‌త్రుల్లో చేరారు.  రానున్న వారం ప‌దిరోజుల్లో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య మరింత భారీగా పెరిగే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.  సుమారు 2-3 ల‌క్ష‌ల మంది ఆసుప‌త్రుల్లో చేర‌తార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  కొల‌రాడో, లూసియానా, మేరిలాండ్, వ‌ర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికే హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించారు.  


ఇక... ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే దేశ‌వ్యాప్తంగా హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించాల్సి రావొచ్చ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  క‌రోనా కేసుల‌తో పాటు చికిత్స‌కోసం ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగుల సంఖ్య పెరుగుతోన్ననేపధ్యంలో... సిబ్బంది కొర‌త కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా పరిణమిస్తోంది. సుమారు 1200 ఆసుప‌త్రుల్లో వైద్యులు, సిబ్బంది కొర‌త ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.  హెల్త్ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించ‌డంతో సిబ్బందిని వెంట‌నే నియమించుకోవాల‌ని, అన్ని సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని  ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.


సెకనుకు తొమ్మిది పాజిటివ్‌ కేసులు... 

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి తారస్థాయిలో  భయపెడుతోంది.. కోవిడ్‌ ఉగ్రరూపం దాల్చి పంజా విసురుతోంది. సోమవారం కనీసం 1.13 మిలియన్ కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు  నమోదయ్యాయి.. గతంలో 1.03 లక్షల పాజిటివ్‌ కేసులే అత్యధిక  రికార్డుగా ఉండగా... ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్ధలు కొడుతూ.. ఏకంగా ఒకేరోజు 1.13 లక్షల కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. ఓవైపు కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వ్యాప్తి మందగించిందనే సంకేతాలు ఉన్నప్పటికీ... డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తోంది. 


ఇక, ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగానే  నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,04,150 మందికి వైరస్​సోకింది. మరో 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో...  మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955 కు చేరాయి. అమెరికాలో ఒకేరోజు 14,49,005 మందికి వైరస్​సోకింది. వారం రోజుల సగటును పరిశీలిస్తే... అమెరికాలో ప్రతీ సెకన్‌కు తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-12T00:32:15+05:30 IST