పాజిటివ్‌ ఉన్నా నెగిటివ్‌ రిపోర్టు

ABN , First Publish Date - 2022-01-18T05:23:27+05:30 IST

కరోనా విజృంభిస్తున్న వేళ కొన్ని ప్రైవేటు ల్యాబులు నిర్లక్షంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇష్టారీతిన రేటు నిర్ణయించి దండుకుంటున్నాయి.

పాజిటివ్‌ ఉన్నా నెగిటివ్‌ రిపోర్టు
కొత్తగూడెంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ ఇచ్చిన కరోనా రిపోర్టు

కొత్తగూడెంలో ఓ ప్రైవేటు ల్యాబ్‌ తప్పుడు నివేదిక

బాలిక ద్వారా మరి కొందరికి సంక్రమించిన వైరస్‌ 

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 17: కరోనా విజృంభిస్తున్న వేళ కొన్ని ప్రైవేటు ల్యాబులు నిర్లక్షంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇష్టారీతిన రేటు నిర్ణయించి దండుకుంటున్నాయి. అంతే కాకుండా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పుడు రిపోర్టులతో వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. కొత్తగూడెలోఓని కొన్ని ప్రైవేటు ల్యాబుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 14న కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌ వారు ఇచ్చిన ఓ రిపోర్టు గందరగోళానికి దారి తీసింది. మరికొంతమందికి వైరస్‌ సోకడానికి కారణమైంది. ఖమ్మం నగరా నికి చెందిని ఓ మహిళ ఇటీవల తన కూతురుతో కలిసి కొత్తగూడెంలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లింది. తరువాత తన కూ తురిని అక్కడే వదిలి సదరు మహిళ ఖమం తిరిగి వచ్చింది. అయితే ఆమెకు నలతగా ఉండడంతో గత శుక్రవారం తన భర్తతో కలిసి కరోనా పరీక్ష చేయించుకోవడంతో ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. దాంతో కొత్తగూడెంలో ఉన్న తన కూతురు, చెల్లెలికి చెప్పడంతో వారు కూడా కొత్తగూడెంలోని సింగరేణి ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించారు. అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఫలితం సోమవారం వస్తుందని వైద్యులు చెప్పడంతో ఎందుకైనా మంచిదని కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఒక్కొక్కరికి రూ.1,000 చెల్లించి పరీక్ష చేయించుకున్నారు. అయితే ఆ ల్యాబ్‌వారు వారిద్దరికి నెగె టివ్‌ వచ్చిందని రిపోర్టు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకొన్నారు. దీంతో అందరితో కలిసి తిరిగారు. ఆ తర్వాత ఖమ్మంలో ఉన్న మహిళ తన కూతురును తన వద్దకు రావాలని కోరడంతో సదరు బాలిక(వయస్సు 14) సోమవారం బయలుదేరింది. అయితే ఈలోగా సింగరేణి ఆసుపత్రి నుంచి బాలికకు పాజిటివ్‌ అని మెసేజ్‌ రావడంతో ఆవాక్కయ్యారు. ఇలా వేర్వేరు రిపోర్టులు రావడంతో నిర్ధారణ కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో మళ్లీ పరీక్ష చే యించారు. దాంతో బాలికకు పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత కొత్తగూ డెంలోని సదరు మహిళ చెల్లెలు, ఆమె కుమారుడు మరొకరు పరీక్ష చేయించుకోగా ఆ ముగ్గురికీ పాజిటివ్‌ తేలింది. ఒక తప్పుడు రిపోర్టుతో ముగ్గురుకి వైరస్‌ సంక్రమిం చిందని, ఇంకా ఎంతమందికి వారి ద్వారా వైరస్‌ సంక్ర మించిందోనని ఆందోళన చెందుతున్నారు. ల్యాబ్‌ నిర్వాహ కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-18T05:23:27+05:30 IST