చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అతనిని చెన్నైలోని కింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెవెంటివ్ మెడిసిన్‌లో చేర్పించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను చెన్నై, బెంగళూరుకు పంపించారు.