466 మందికి కరోనా వైద్య సేవలు

ABN , First Publish Date - 2020-08-10T10:37:29+05:30 IST

మండలంలో ఆదివారం 16 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 466 మందికి కరోనా పాజిటివ్‌ సోకిందని, వీరంతా చికిత్స ..

466 మందికి కరోనా వైద్య సేవలు

నరసన్నపేట, ఆగస్టు 9: మండలంలో ఆదివారం 16 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 466 మందికి కరోనా పాజిటివ్‌ సోకిందని, వీరంతా చికిత్స పొందుతున్నారని మండల కొవిడ్‌ అధికారి ఆర్వీ రామన్‌ అన్నా రు. పలు బాధి త గ్రామాల్లో పర్యటించి సి బ్బందికి సూచనలిచ్చారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది పడే వారిని గుర్తించి వెంటనే  సచివాలయా నికి సమాచారం ఇవ్వాలన్నారు. తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఈవోపీఆర్డీ రవికుమార్‌, ఈవో మోహన్‌ బాబు తదితరులు పాల్గొ న్నారు.


రేగిడి: మండలంలో కంటైన్మెంట్‌గా గుర్తించిన మూడు గ్రామాలతో పాటు మరో గ్రామంలో ఆదివారం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆర్‌ఐలు ఉమా పట్నాయక్‌, శ్రీనువాసరావు తెలిపారు. ఈ గ్రామాల్లో బయటపడిన పాజిటివ్‌ కేసుల కాంటాక్టులకు ఈనెల 3న ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించగా వీరిలో 14 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని సమాచారం అందిందని చెప్పారు. ఈ గ్రా మాల్లో తదుపరి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


పాత పట్నం: మండల వ్యాప్తంగా ఆదివారం 9 మందిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించి నట్లు తహసీల్దార్‌ ఎం.కాళీ ప్ర సాద్‌ తెలిపారు. మండల కేంద్రంతో పాటు మరో రెండు గ్రామాల్లో ఈ లక్షణాలతో బాధితులను గుర్తించామన్నారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రా మాల్లో 51 మంది జ్వరపీడితులను గుర్తించి వైద్య సేవలు అందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మండల కేంద్రం, మరో గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు అధిక జ్వరం ఉండి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని చెప్పారు.


ఎల్‌.ఎన్‌.పేట: మండలంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఎంపీడీ వో ఆర్‌.కాళీప్రసాదరావు ఆదివారం తెలిపారు. వారం రోజుల కిందట కొవిడ్‌-19 వైద్య పరీక్షలు చేయగా వాటి ఫలితాలు ఆదివారం వచ్చా యన్నారు. ఏడుగురిలో నలుగురు గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇద్దరు వైద్యసిబ్బంది, మిగిలిర వారు ఇతర గ్రామాలకు చెందిన వారన్నారు. సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వైద్యాధికారి టి.ప్రవల్లిక తెలిపారు.


మందస: గిరిజన గ్రామాల్లో ఆదివారం  14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్‌ బి.అప్ప లరాజు తెలిపారు. 12 మందిని సంతబొ మ్మాళి క్వారంటైన్‌ కేంద్రానికి, ఇద్దరిని జెమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు  చెప్పారు.


నందిగాం: మండలంలో ఆదివారం రెండు కరోనా అను మానిత లక్షణాలు కలిగిన వారిని గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. వీరిని ప్రత్యేక వాహనంతో ఆస్పత్రికి తరలించా మన్నారు. ఫ వజ్రపు కొత్తూరు: మండలం లో ఆదివారం ఒకరికి కరోనా పాజిటివ్‌ నమో దైనట్లు తహసీల్దార్‌ నారాయణ మూర్తి తెలి పారు. ఈ మేరకు స్థానికులను అప్రమత్తం చేశామని చెప్పారు. 

Updated Date - 2020-08-10T10:37:29+05:30 IST