జాగృతి ఏదీ

ABN , First Publish Date - 2020-08-11T11:39:22+05:30 IST

కరోనా మహమ్మారి పదుల సంఖ్యలో జనాన్ని పొట్టన పెట్టుకుం టూ విలయం సృష్టిస్తున్నా ప్రజల్లో జాగృతి కనిపించడం లేదు.

జాగృతి ఏదీ

 ఎవరికీ పట్టని కరోనా నిబంధనలు

  భౌతికదూరం.. బహుదూరం..

  ఎటుచూసినా వాహనాల రద్దీ

  నియంత్రణలో అధికారులు విఫలం

  కరోనా కట్టడికి కళ్లెం పడేదెలా?


అనంతపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి పదుల సంఖ్యలో జనాన్ని పొట్టన పెట్టుకుం టూ విలయం సృష్టిస్తున్నా ప్రజల్లో జాగృతి కనిపించడం లేదు. దీంతో జిల్లాలో రోజూ వందలాది మంది కరోనా బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనే కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 25 వేలదాకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో ప్రస్తుతం 7 వేల మందికిపైగా బాధి తులు వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 199 మంది చనిపోయారని జిల్లా అధికారుల గణాంకాలు చెబుతున్నా ఈ సంఖ్య అంతకంటే  ఎక్కువగానే ఉంటుం దని సమాచారం.


కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజలు వాటికి తిలోదకాలిస్తున్నారు. కట్టడి చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పోలీసు యంత్రాంగం ఆ బాధ్యతను అశ్రద్ధ చేస్తోందన్న విమర్శలు విని పిస్తున్నాయి. సోమవారం అనంతపురం నగరంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి జనం గుంపులుగుంపులుగా రోడ్లపైకి వ చ్చారు.


వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని ఏ జంక్షన్‌లో చూసినా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కొక్కరికి మధ్య కనీసం అడుగు దూరం కూడా లేని పరిస్థితి. భౌతికదూరాన్ని పాటించాన్న స్పృహ ఎవరిలోనూ కనిపించలేదు. మాస్కులు సక్రమంగా ధరించాలన్న కనీస బాధ్యతను మరిచారు. దుకాణాల నిర్వాహకులు సైతం శానిటైజర్‌ను అందు బాటులో ఉంచడం లేదు.


ఫ్లైఓవర్‌ల బంద్‌తో ట్రాఫిక్‌ జామ్‌

జిల్లా కేంద్రంలో టవర్‌క్లాక్‌, రామ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి లను పూర్తిస్థాయిలో బంద్‌ చేస్తుండటంతో వాహనదా రులు తమ ప్రాంతాలకు ఎటు వెళ్లాలో తెలియక అంద రూ రహమత్‌నగర్‌ బ్రిడ్జి కింద దారిని ఎంచుకుంటున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అంబులెన్స్‌లు సైతం ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. ఎక్కువసేపు అక్కడ వాహనాలు నిలిచిపోతుండటంతో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆ రెండు ఫ్లైఓవర్లను ఓపెన్‌ చే యటం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఆంక్షలు సరే.. కట్టడేదీ?

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్‌ సడలింపు ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ అన్ని దుకాణాలు తెరవడానికి, ప్రజలు తిరగడానికి వీలు కల్పించింది. ఆ సమయంలో ప్రజలు గుంపు లు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. వాహనాల రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని పలు వర్గా ల నుంచి బలంగా వినిపిస్తోంది.


ఈ నిర్దేశిత సమయం లో ప్రజలు కరోనా బారిన పడకుండా నియంత్రించాల్సిన బాధ్యత రెవెన్యూ, ఇతర శాఖలకంటే పోలీసుశాఖపైనే ఎ క్కువగా ఉంది.  ఉదయం 10.30 గంటల నుంచే పోలీసు లు దుకాణాలు బంద్‌ చేయించే విషయంలో చూపుతున్న శ్రద్ధ ప్రజలను నియంత్రించడంలో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-08-11T11:39:22+05:30 IST