ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2022-01-11T17:43:17+05:30 IST

ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ..

ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలని, వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని స్పష్టం చేస్తూ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. నిత్యావసర, అత్యవసర సేవలు మినహా అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఢిల్లీలో పాజిటివ్ రేటు 23 శాతానికి పెరిగిన నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిబంధనలు అమలవుతాయని స్పష్టం చేసింది. అన్ని రెస్టారెంట్లు, బార్లు  మూసివేయాలని, రెస్టారెంట్ల నుంచి టేక్‌అవేలు మాత్రమే అనుమతించబడతాయని డిజాస్టర్ మేనేజ్ మెంట్ పేర్కొంది.

Updated Date - 2022-01-11T17:43:17+05:30 IST