కరోనా ఎఫెక్ట్... ఏపీ-కర్ణాటక బస్సు సర్వీసులకు బ్రేకులు

ABN , First Publish Date - 2020-07-13T00:37:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్-కర్ణాటక అంతరాష్ట్ర బస్ సర్వీసులకు బ్రేక్ పడనుంది. ఈ నెల 15 నుంచి 23 వరకు మొత్తం 120 సర్వీసులు నిలిచిపోనున్నాయి. కరోనానేపధ్యంలో కర్నాటకలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవలే అంతర్రాష్ట్ర బస్ రవాణా మొదలైన విషయం తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్... ఏపీ-కర్ణాటక బస్సు సర్వీసులకు బ్రేకులు

అమరావతి :  ఆంధ్రప్రదేశ్-కర్ణాటక అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు బ్రేక్ పడనుంది. ఈ నెల 15 నుంచి 23 వరకు మొత్తం 120 సర్వీసులు నిలిచిపోనున్నాయి. కరోనానేపధ్యంలో కర్నాటకలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య  కొంత విరామం తర్ఇవాత ఇటీవలే అంతర్రాష్ట్ర బస్ రవాణా మొదలైంది, 


అయితే అనూహ్యంగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న నేపధ్యంలో... కరోనా కట్టడికి క్నాటక ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. బెంగళూరు సహా అర్బన్ లో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో ఏపీ నుంచి వెళ్ళే బస్సులకు బ్రేక్ పడింది. ప్రస్తుతానికైతే... ఈ నెల 23 వరకు బస్సులను నిలిపివేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

Updated Date - 2020-07-13T00:37:57+05:30 IST