పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 591మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-14T12:38:57+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం 591 కేసులు..

పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 591మందికి పాజిటివ్

‌ఏలూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం 591 కేసులు నమోదయ్యాయి.దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22,065కి చేరింది. జిల్లాలో భీమవరం పట్టణంలో కేసుల పరంపర కొన సాగుతోంది.ఇక్కడ అత్యధికంగా గురువారం ఒక్కరోజే 83 కేసులు నమోదయ్యాయి. కాగా ఏలూరులో కొంత తగ్గి 72 కేసులు నమో దవగా తాడేపల్లిగూడెంలో కేసుల సంఖ్య 68కి పెరిగింది. తణుకు 34, నరసాపురం 27, పాలకొల్లు 28, నిడదవోలు 13, జంగారెడ్డి గూడెం 8 కేసులు నమోదవగా కొవ్వూరులో మాత్రం ఒక కేసు కూడా నమోదు కాలేదు. గ్రామీణ మండలాల్లో ఒక నాలుగైదు మండ లాల మినహా మిగిలిన మండలాల్లో కేసుల సంఖ్య గురువారం కొంచెం తగ్గినట్లు అనిపిం చింది..పెనుగొండ 19, ఉండ్రాజవరం 19, యలమంచిలి17,ఆకివీడు 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.ఈ మండలాల్లో గడచిన నాలుగు రోజులుగా ఇదే కొనసాగుతోంది. నల్లజర్ల 12, పెనుమంట్ర 11,అత్తిలి 11, కొయ్యలగూడెం 10,గణపవరం 10, పెంట పాడు 9, పోడూరు 9, భీమడోలు 8 కేసులు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ ఐదు కంటే తక్కువ కేసులే నమోద య్యాయి.గురువారం కరోనా కారణంగా ఐదుగురు మృతిచెందారు. 


Updated Date - 2020-08-14T12:38:57+05:30 IST