భారత్‌లో కొత్తగా 90,928 కరోనా కేసులు..

ABN , First Publish Date - 2022-01-06T16:47:50+05:30 IST

భారత దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి.

భారత్‌లో కొత్తగా 90,928 కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 325 మంది మృతి చెందారు. చికిత్స నుంచి కోలుకుని 19,206 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,85,401 యాక్టీవ్ కేసులుండగా.. 3,43,41,009 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్‌తో 4,82,876 మృతి చెందారు. కాగా దేశవ్యాప్తంగా 148.67 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. 


అలాగే భారత్‌లో ఇప్పటివరకు ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 2,630కి చేరగా... 995మంది కోలుకున్నారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా వివరాలు...

మహారాష్ట్ర 797, ఢిల్లీ 465, రాజస్థాన్ 236, కేరళ 234, కర్ణాటక 226, గుజరాత్ 204, తమిళనాడు 121, తెలంగాణ 94, హర్యానా 71, ఒడిస్సా 60, ఉత్తర ప్రదేశ్ 31, ఆంధ్రప్రదేశ్ 28, వెస్ట్ బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 9, ఉత్తరాఖండ్ 8, గోవా 5, మేఘాలయ 4, చండీగర్‌లో 3 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-01-06T16:47:50+05:30 IST