Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో కరోనా విశ్వరూపం

అమరావతి: ఏపీలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టకముందే థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో కేసులు పెరగడం థర్డ్ వేవ్‌కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల నిర్లక్ష్యమే థర్డ్ వేవ్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విలయతాండవం చేస్తోంది. కరోనా బాధితులు మళ్లీ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రికవరీ కేసులు తగ్గుతుండగా.. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. వారిలో ఎక్కువ మంది ఆక్సిజన్ కోసం పరుగులు తీయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదివారం పాజిటీవ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరుకుంది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు రోజుల నుంచి కరోనా అడ్మిషన్ కేసులు పెరుగుతున్నాయి. వారిలో ఎక్కువ మంది జ్వరం వచ్చినా ఇంటివద్ద చికిత్స పొందుతూ, ఆ తర్వాత ఆక్సిజన్ సమస్యతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

Advertisement
Advertisement