Abn logo
Sep 17 2020 @ 10:38AM

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌ దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు  పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 97,894 కేసులు నమోదు కాగా.. 1,132 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 51,18,254 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 83,198 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 10,09,976 యాక్టివ్ కేసులుండాగా.. చికిత్స నుంచి కోలుకుని 40,25,080 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 82,719 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 78.64 శాతంగా కాగా మరణాల రేటు 1.63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement
Advertisement