Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 27 2021 @ 12:10PM

కరోనా నియంత్రణలో ఈ రెండు నెలలు కీలకం: కేంద్రం

దేశంలో మరోసారి కరోనా విళయతాండవం తప్పదన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ మధ్యలో ఉన్నామని, వైరస్ నియంత్రణలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ముఖ్యమైనవని కేంద్రం హెచ్చరిస్తోంది. రానున్న పండుగలను కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించింది. సెకండ్ వేవ్ ఇంకా ముగియనేలేదు. గతంలో ప్రతి పండుగ అనంతరం కేసులు పెరిగిన సంగతి మరువద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించడం ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.


ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు నిన్న దేశవ్యాప్తంగా అమాంతం పెరిగాయి. మృతుల సంఖ్య కూడా పెరిగింది. రోజు రోజుకు కరోనా కేసుల్లో పెరుగుదల థర్డ్ వేవ్‌కు సంకేతమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement