కమ్ముకొస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-16T06:23:57+05:30 IST

కమ్ముకొస్తున్న కరోనా

కమ్ముకొస్తున్న కరోనా

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

ఇరుజిల్లాల్లో 895మందికి పాజిటివ్‌ 

ఖమ్మం సంక్షేమ విభాగం/ ఖమ్మం కార్పొరేషన్‌/ కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15 : కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందు తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురు వారం ఒక్కరోజే 895 మంది కొవిడ్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత జటిలమవుతోందో అర్థమవుతోంది. ఈ క్రమంలో అనుమా నితులు నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రభు త్వ ఆసుపత్రికి రోజుకు 500మంది వరకు కరోనా పరీక్షలకు వస్తుండగా.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటల నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఖమ్మం జిలాల్లో గురువారం 3,500మంది పరీక్షలు చేయగా 650మందికి పాజిటివ్‌ వచ్చింది. గురువారం భద్రాద్రి జిల్లాలో 4,492 మందికి పరీక్షలు నిర్వహించగా 245మందికి పాజిటివ్‌వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు.  

ఖమ్మం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కలకలం.. 

ఖమ్మం శ్రీరాంహిల్స్‌ ప్రాంతంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ అధికారి, ఇద్దరు ఆప రేటర్లకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మార్చిలో సెలవులు అయినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పని చేశాయి. రిజిస్ట్రేషన్లు ఎక్కు వగా జరిగి, రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడంలో జరిగిన అల సత్వం కారణంగా వారికి కరోనా వచ్చిందన్న చర్చ జరుగుతోంది. 

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌..

ఖమ్మం జిల్లాలో గురువారం కొవిన్‌ యాప్‌లో నమోదు చేయించుకున్న 2863మందితో పాటు 16మంది హెల్త్‌కేర్‌, 262మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 3001 మంది ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొని టీకా వేయించుకున్నారు. 

Updated Date - 2021-04-16T06:23:57+05:30 IST