జిల్లాలో 26 శాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-26T05:57:14+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 26 శాతం నమోదైంది. 60 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 574 మం దికి టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య తెలిపారు.

జిల్లాలో 26 శాతం వ్యాక్సినేషన్‌

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 25: జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 26 శాతం నమోదైంది. 60 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 574 మం దికి టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య తెలిపారు. 4523 మందికి గాను 574 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కర్నూలు జీజీహెచ్‌లో టీకా కేంద్రంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. జిల్లాలో సోమవారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60,778కు చేరింది. 

 

Updated Date - 2021-01-26T05:57:14+05:30 IST