కబళిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-12-02T04:52:14+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో కరోనా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

కబళిస్తున్న కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో కరోనా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు ఇద్దరు చొప్పున కరోనా కాటుకు బలైపో తున్నారు. మంగళవారం ఇద్దరు కరోనాతో మృతి చెందారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 197కు చేరుకుంది. వికారాబాద్‌ జిల్లాలో 54, మేడ్చల్‌ జిల్లాలో 98కి చేరుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మృతుల సంఖ్య మొత్తం 349కి చేరుకుంది. 


157 కేసులు నమోదు

ఉమ్మడిజిల్లాలో మంగళవారం 157 కేసులు నమోద య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 85, వికారాబాద్‌  జిల్లాలో 4, మేడ్చల్‌ జిల్లాలో 68 కేసులున్నాయి. ఇప్పటి వరకు మొత్త కరోనా సోకిన వారిసంఖ్య 1,06,265కు చేరుకుంది.


షాద్‌నగర్‌, చేవెళ్ల డివిజన్‌లో...

షాద్‌నగర్‌అర్బన్‌ / చేవెళ్ల : షాద్‌నగర్‌ డివిజన్‌లో మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. డివిజన్‌ పరిధిలోని షాద్‌నగర్‌ పీపీయూనిట్‌తో పాటు బూర్గుల, చించోడ్‌, కొందుర్గు, కేశంపేట, కొత్తూర్‌, నందిగామా పీహెచ్‌సీలో 154 మందికి పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్‌ పీపీయూనిట్‌ పరీక్షల్లో ముగ్గురికి, కొత్తూర్‌ పీహెచ్‌సీ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 140 మందికి కరోనా వైద్యపరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యులు తెలిపారు.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో మంగళవారం కరోనా కేసులు తక్కువగానే నమోద య్యాయి. వికారాబాద్‌లో 2, పూడూరు, బొంరాస్‌పేట్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,921 కరోనా కేసులు నమోదుకాగా, వాటిలో 192 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 9 మంది ఆసుపత్రుల్లో, 183 మంది హోంకేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 


సోండేపూర్‌లో వైద్యశిబిరం

పరిగి : పరిగి మండలం సోండేపూర్‌లో మంగళవారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 86 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి అపర్ణ మాట్లాడుతూ, ప్రభు త్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బోజ్యానాయక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 40మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చి నట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. శ్రీరంగవరం పీహెచ్‌సీలో 16మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు. 

Updated Date - 2020-12-02T04:52:14+05:30 IST