గద్వాలలో కేసులు నిల్‌

ABN , First Publish Date - 2020-11-29T05:04:37+05:30 IST

కరోనా వై రస్‌ ప్రారంభమైన మొదట్లో ఉ మ్మడి పాలమూరు జిల్లాలోని జో గుళాంబ గద్వాల జిల్లాలోనే అత్య ధికంగా కేసులు నమోదయ్యాయి.

గద్వాలలో కేసులు నిల్‌

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 34 మందికి పాజిటివ్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభా గం)/నారాయణపేట క్రైం/గద్వా ల క్రైం/వనపర్తి/నాగర్‌కర్నూల్‌ క్రైం, నవంబరు 28 : కరోనా వై రస్‌ ప్రారంభమైన మొదట్లో ఉ మ్మడి పాలమూరు జిల్లాలోని జో గుళాంబ గద్వాల జిల్లాలోనే అత్య ధికంగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఎక్కువగా ఉం డేవి. ఏప్రిల్‌, మే, జూన్‌లలో ప్ర తి రోజూ వంద కేసులు వచ్చా యి. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తొమ్మిది నెలల అనంతరం తొలిసారిగా శనివారం ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం 34 మందికి వైరస్‌ నిర్ధారణ అ య్యింది. అందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 16 మందికి పాజిటివ్‌ అని తేలింది.

- మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ కాగా, మిగిలిన 11 కేసులు వివిధ మండలాల్లో వచ్చాయి.

- నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 16 కరోనా కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ మండలంలో ఆరు మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

- వనపర్తి జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది.

- నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2020-11-29T05:04:37+05:30 IST