Abn logo
Apr 14 2021 @ 03:22AM

ఇండియా ఓపెన్‌కు మారిన్‌, మొమోటా

  • బయోబబుల్‌లో టోర్నీ


న్యూఢిల్లీ: ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌, పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కెంటో మొమోటా, కిడాంబి శ్రీకాంత్‌ సహా పలువురు స్టార్‌ షట్లర్లు ఈ ఏడాది ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొననున్నారు. మే 11 నుంచి 16 వరకు  పూర్తి బయోబబుల్‌ వాతావరణంలో టోర్నీ జరగనుంది. ఈ సూపర్‌-500 ఈవెంట్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య తెలిపింది. చైనాతో సహా మొత్తం 33 దేశాలకు చెందిన 228 మంది షట్లర్లు ఇందులో తలపడనుండగా భారత్‌ నుంచి 48 మంది పోటీపడుతున్నారు. ఈనెల 20న టోర్నీ డ్రాలను తీయనున్నారు. 


Advertisement
Advertisement
Advertisement