ఘనంగా కారల్‌మార్క్స్‌ జయంతి

ABN , First Publish Date - 2021-05-06T05:41:53+05:30 IST

కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్‌మార్క్స్‌ జయంతి వేడుకలు పత్తికొండలో బుధవారం ఘనంగా జరిగాయి.

ఘనంగా కారల్‌మార్క్స్‌ జయంతి

పత్తికొండటౌన్‌, మే 5: కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్‌మార్క్స్‌ జయంతి వేడుకలు పత్తికొండలో బుధవారం ఘనంగా జరిగాయి. 203 జయంతిని పురస్కరించుకుని స్థానిక సీఆర్‌ భవన్‌లో కారల్‌మార్క్స్‌ చిత్రపటానికి సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావులలో కారల్‌మార్క్స్‌ అగ్రగామి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, ఎస్టీయూ నాయకులు సత్యనారాయణ, సుంకన్న, సీపీఐ నాయకులు గిడ్డయ్యగౌడ్‌, నరసింహులు, భగవాన్‌, లక్ష్మన్న పాల్గొన్నారు. 


దేవనకొండ: దేవనకొండలోని సీపీఐ కార్యాలయంలో కారల్‌మార్క్స్‌ జయంతిని సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి నర్సారావు, సహాయ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నెట్టెకల్లు, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి మార్గదర్శి, శాస్త్రీయ కమ్యూనిస్టు, సోషలిస్టు సిద్ధాంత  సృష్టికర్త మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్‌మార్క్స్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, భాస్కర్‌, రషీద్‌, కృష్ణ, శ్రీనివాసులు, కోదండ, నాగరాజు, రాజు, శేఖర్‌, వెంకటేశ్వర్లు, నల్లన్న, కేసన్న, మహేష్‌, హరి తదితరులు పాల్గొన్నారు. 


డోన్‌(రూరల్‌): పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం కారల్‌ మార్క్స్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజినేయులు మాట్లాడుతూ కారల్‌ మార్క్స్‌ ఆశయసాధన కోసం కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, అనుబంధ సంఘాల నాయకులు లెనిన్‌బాబు, సుంకయ్య, రాధాక్రిష్ణ, లక్ష్మీనారాయణ, అబ్బాస్‌, పుల్లయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:41:53+05:30 IST