Emergency landing: రన్‌వేపైనే రెండు ముక్కలైన విమానం.. వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2022-04-08T18:16:38+05:30 IST

ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రెండు ముక్కలైన షాకింగ్ ఘటన కొస్టారికాలోని శాన్‌జోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది.

Emergency landing: రన్‌వేపైనే రెండు ముక్కలైన విమానం.. వైరల్ వీడియో!

శాన్‌జోస్: ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రెండు ముక్కలైన షాకింగ్ ఘటన కొస్టారికాలోని శాన్‌జోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది. జర్మన్ లాజిస్టిక్ డీహెచ్ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం కొస్టారికాలోని శాన్‌జోన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాశ్రయ అధికారుల అనుమతి తీసుకున్నారు. అనంతరం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై కొద్దిదూరం వెళ్లాక విమానం పక్కకు ఒరిగింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, విమానంలో తలెత్తిన హైడ్రాలిక్ సమస్య కారణంగానే ఇలా జరిగిందని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉండడం, వారిద్దరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.          



Updated Date - 2022-04-08T18:16:38+05:30 IST