కర్ఫ్యూ కట్టడి

ABN , First Publish Date - 2021-07-28T06:36:04+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం కర్ఫ్యూ నిబంధనలు అమలుచేస్తున్నారు.

కర్ఫ్యూ కట్టడి
ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్‌ జోన్‌

కోనసీమ ప్రాంతంలో ఎక్కడికక్కడ కర్ఫ్యూలు

గ్రామాల్లో వైరస్‌ విజృంభణతో కఠిన ఆంక్షలు

నేటి నుంచి పి.గన్నవరంలో కర్ఫ్యూ ఎత్తివేత

మిగిలిన గ్రామాల్లో ఆంక్షలు కొనసాగింపు

కంటైన్మెంట్‌ జోన్లూ ఏర్పాటు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం కర్ఫ్యూ నిబంధనలు అమలుచేస్తున్నారు. వైరస్‌ గ్రామాల్లో విస్తరించకుండా ఉండే లక్ష్యంతో కర్ఫ్యూ ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తు న్నారు. కోనసీమలోని ఆరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తు న్నారు. అయితే సత్ఫలితాలతో పి.గన్నవరం మండ లంలో బుధవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలి స్తున్నారు. జిల్లాలో మంగళవారం కేవలం 3 కేసులు నమోదైనట్టు చూపారు. అలాగే ప్రస్తుతం 3678 యా క్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులు 2,75,975 నమోదయ్యాయి. 2,71,090 కేసులు రికవరీ అయి నట్టు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుం డగా కేవలం మూడు కేసులే చూపడంతో రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానాన్ని జిల్లా సంపాదించింది. కానీ మెయింటినెన్స్‌ హాలిడే కారణంగా యాభైలోపే పరీక్షలు జరగడం వల్ల ఆ సంఖ్య తగ్గినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అంటే బుధవారం నాటి బులిటెన్‌లో యథాతథంగా మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక కోనసీమలో గత కొన్నిరోజుల నుంచి కరోనా కేసులు విస్తరించడంతో ఎక్కడికక్కడే కర్ఫ్యూ, కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటుచేసి వైరస్‌ వ్యాప్తికి అధికార యంత్రాంగం అడ్డకట్ట వేసింది. ఇప్పటివరకు పి.గన్నవరం మండల పరిధిలోని 20 గ్రామాల్లో కర్ఫ్యూను పగడ్బందీగా అమలుచేయడంతో కేసుల వ్యాప్తిని అరికట్టగలిగారు. దాంతో బుధవారం నుంచి మండల వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూ ఆంక్ష లను సడలించారు. ఆత్రేయపురం మండలం ర్యాలిలో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటుచేశారు. మండలంలోని ఆత్రేయపురం, వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వెలిచేరులో కూడా ఈ నిబంధనలు అమ లుచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఉద యం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడానికి  అనుమతిచ్చారు. మధ్యాహ్నం 2 గం టల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తు న్నారు. రాజోలు మండలంలోని 16 గ్రామాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. వాణిజ్య కేంద్రాలైన రాజోలు, తాటి పాక కావడంతో వర్తక వాణిజ్య, వ్యా పార సంస్థలన్నీ మూసి వేస్తున్నారు. ఇక్కడ కర్ఫ్యూ నిబంధనలతోపాటు 144 సెక్షన్‌ కూడా అమలు చేస్తు న్నారు. కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, పల్లంకుర్రు, కాట్రేనికోన గ్రామాల్లోను, ఉప్పలగుప్తం మండ లంలో ఉప్పలగుప్తం, ఎస్‌. యానాం, చల్లపల్లి గ్రామాల్లో కర్ఫ్యూ నిబంధ నలు అమలుచేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసు కుంటున్నా ఉప్పలగుప్తంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కు గురిచేస్తోంది. దీంతో అధికారులు కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. 



Updated Date - 2021-07-28T06:36:04+05:30 IST