నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-18T03:21:01+05:30 IST

కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిందని, కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా

నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
కసుమూరులో కర్ఫ్యూను పరిశీలిస్తున్న ఎస్‌ఐ కరీముల్లా

వెంకటాచలం, మే 17 : కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిందని, కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా హెచ్చరించారు. మండలంలోని కసుమూరులో అమలు అవుతున్న కర్ఫ్యూను సోమవారం ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12  వరకు దుకాణాలు తెరచుకోవచ్చని, ఆ తర్వాత మూసివేయాలన్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదన్నారు. కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని  కోరారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ రామకృష్ణ  ఉన్నారు.


Updated Date - 2021-05-18T03:21:01+05:30 IST