Abn logo
Oct 28 2020 @ 18:52PM

హిస్టరీ క్రియేట్ చేసిన 'కేరాఫ్‌ అనసూయ'

Kaakateeya

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సీరియల్స్‌కున్న ప్రాధాన్యతే వేరు. అలాంటి సీరియల్స్‌లో మొదలై వారం అయ్యేసరికి మిగతా ఛానెల్స్‌లోని ఇతర సీరియల్స్‌ను దాటేసి అగ్రగామిగా దూసుకెళ్తోన్న సీరియల్‌ 'కేరాఫ్‌ అనసూయ'. మధ్యాహ్న సమయంలో ప్రసారమయ్యే అన్నీ ఛానెల్స్‌లోని సీరియల్స్‌ను క్రాస్‌ చేసి 7.1 రేటింగ్‌తో దూసుకెళుతోందీ సీరియల్‌. ఇలా ఓ సీరియల్‌ తొలివారంలోనే ఇంత టాప్‌ రేంజ్‌లో రేంటిగ్‌ను సంపాదించుకోవడం టెలివిజన్‌ చరిత్రలోనే ప్రథమం. కేరాఫ్ అన‌సూయ సీరియ‌ల్ ప్రైమ్ టైమ్‌లో కాకుండా మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌వుతున్న‌ది. అయినప్పటికీ ప్రైమ్ టైమ్ స్థాయిలో స‌మాన రేటింగ్స్ సాధిస్తుండటం విశేషం. త‌మ జీవితంలో జ‌రిగిన ఒడిదుడుకులు పిల్ల‌లు ఎదుర్కోకూడ‌ద‌ని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటి త‌ల్లే కథే ఇది. 


Advertisement
Advertisement