పత్తి సాగులో మెలకువలు పాటించాలి

ABN , First Publish Date - 2022-08-12T04:58:52+05:30 IST

పత్తి పంట సాగులో రైతులు మెలకువలు పాటిస్తే మంచి దిగుబ డి వస్తుందని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, ప్రా జెక్ట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీవిద్య అన్నారు.

పత్తి సాగులో మెలకువలు పాటించాలి
పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

మైలవరం, ఆగస్టు 11: పత్తి పంట సాగులో రైతులు మెలకువలు పాటిస్తే మంచి దిగుబ డి వస్తుందని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, ప్రా జెక్ట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీవిద్య అన్నారు. చిన్నకొమెర్ల పొలాల్లో సాగు చేసిన పంట పొలాలను శాస్త్రవేత్తలు డాక్టర్లు హర్షిత, ఫిరోజ్‌ పరిశీలించి రైతులకు దాల్మియా ఆధ్వర్యంలో పొలంబడి నిర్వహించారు. శాస్త్రవేత్తలు పత్తి పంటలో తెగుళ్ల యా జమాన్యం, నీటి ఎద్దడి ఎక్కువైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పురుగుల నివారణకు మందుల వాడకం, ఉద్యానపంటల లాభదాయకత, స్థానిక వాతావరణ పరిస్థితుల అనుకూలతల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో దాల్మియా అధికారులు రామరాజు, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి బాలక్రిష్ణ, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T04:58:52+05:30 IST