Abn logo
Sep 19 2020 @ 00:00AM

పల్లె ప్రకృతి వనాల సంరక్షణకు శ్రద్ధ తీసుకోవాలి

జిల్లా పంచాయతీ అధికారి వి.నారాయణరావు


జైపూర్‌, సెప్టెంబరు 18 : ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనా లను రూపొందించడంలో ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) వి.నారాయణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఇందారంలో జైపూర్‌, భీమారం మండలాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఇందారంలో నిర్వహించారు. గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేయా లని, గ్రామ శివారులో వైకుంఠథామాలను, కంపోస్ట్‌ షెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతల నిర్మాణాలు ప్రోత్స హించాలన్నారు.


సీజనల్‌ వ్యాధులను నివారించడానికి గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని, ఇంటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు లేకుండా చర్య లు తీసుకొని పంచాయతీలకు ఆదాయం పెంచాలని కోరారు. లే అవుట్లు లేని స్థలాల్లో, కట్టడాలకు ప్రభుత్వ పరంగా అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకుని క్రమబద్ధీకరించాలన్నారు.  డీఎల్‌పీవో ప్రభాకర్‌, జైపూర్‌ ఎంపీడీవో కే. నాగేశ్వర్‌ రెడ్డి, భీమారం ఎంపీడీవో శ్రీనివాస్‌, మండల పంచాయతీ అధికారులు కే. సతీష్‌ కుమార్‌, శ్రీపతి బాపు,  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement