మహారాష్ట్రలోని యునైటెడ్‌ సిగ్మా హాస్పిటల్‌లో కేర్‌ హాస్పిటల్స్‌కు మెజారిటీ వాటా

ABN , First Publish Date - 2022-07-30T09:05:03+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌.. మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని యునైటెడ్‌ సిగ్మా హాస్పిటల్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది.

మహారాష్ట్రలోని యునైటెడ్‌ సిగ్మా హాస్పిటల్‌లో కేర్‌ హాస్పిటల్స్‌కు మెజారిటీ వాటా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌.. మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని యునైటెడ్‌ సిగ్మా హాస్పిటల్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ హాస్పిటల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేర్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. అయితే ఎంత వాటాను కొనుగోలు చేసిందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా డీల్‌ విలువ రూ.300-400 కోట్ల వరకు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్రలో కార్యకలాపాలు విస్తరించటంతో పాటు దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించేందుకు ఈ డీల్‌ దోహదపడుతుందని కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ సీఈఓ జస్‌దీప్‌ సింగ్‌ అన్నారు. 300 పడకల సామర్థ్యం కలిగిన యునైటెడ్‌ సిగ్మా హాస్పిటల్స్‌.. అంకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ప్రత్యేకమైన సేవలందిస్తోంది. అంతేకాదు..ఆ రీజియన్‌లో తొలిసారిగా రోబొటిక్‌ సర్జరీలను నిర్వహించిన హాస్పిటల్‌ కూడా ఇదే. యునైటెడ్‌ సిగ్మా కొనుగోలుతో మహారాష్ట్రలో మొత్తం 3 నగరాలకు కేర్‌ హాస్పిటల్స్‌ విస్తరించిందని సింగ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-30T09:05:03+05:30 IST