హృద్రోగ చికిత్సల్లో రాష్ట్రం ముందంజ: మంత్రి సుబ్రమణ్యం

ABN , First Publish Date - 2022-06-05T16:11:17+05:30 IST

అంతర్జాతీయ స్థాయి హృద్రోగ చికిత్సలందించటంలో రాష్ట్రం ముందంజలో ఉందని, ప్రైవేటు ఆస్పత్రులతో పోటీపడే రీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోమెరుగైన

హృద్రోగ చికిత్సల్లో రాష్ట్రం ముందంజ: మంత్రి సుబ్రమణ్యం

చెన్నై, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి హృద్రోగ చికిత్సలందించటంలో రాష్ట్రం ముందంజలో ఉందని, ప్రైవేటు ఆస్పత్రులతో పోటీపడే రీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోమెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం అన్నారు. నగరంలో శనివారం ఉదయం దేశవిదేశాలకు చెందిన హృద్రోగ శస్త్రచికిత్సా వైద్యనిపుణులు హాజరైన తమిళనాడు ఇంటర్‌వెన్షనల్‌ కౌన్సిల్‌ (టిక్‌ 2022) వార్షిక సదస్సును ప్రారంభించి ఆయన ప్రసంగించారు. హృద్రోగబాధితులకు మెరుగైన చికిత్సలందిస్తుంటం వల్లే రాష్ట్రానికి విదేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో రోగులు తరలివస్తున్నారని చెప్పారు. దేశంలోనే 36 ప్రభుత్వ వైద్యకళాశాలల ఆస్పత్రులు, 34 ప్రైవేటు వైద్యకళాశాలలు ఆస్పత్రులంటూ మొత్తం 70 వైద్యకళాశాలలు కలిగిన ఏకైక రాష్ట్రంగా రాష్ట్రం పేరుగడించిందన్నారు. డీఎంకే ప్రభుత్వం చేపట్టిన ఇళ్లవద్దకే వైద్యం పథకం ద్వారా ఇప్పటివరకూ 72 లక్షల మందికి మెడికల్‌ కిట్లు అందజేశామన్నారు. ఈ సదస్సులో నగరానికి చెందిన వైద్యనిపుణులు డాక్టర్‌ తనికాచలం, డాక్టర్‌ వి చొక్కలింగంకు మంత్రి జీవనసాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సదస్సులో టిక్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సి. మూర్తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కే దామోదరన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-05T16:11:17+05:30 IST