అక్రమ రవాణాను అరికట్టేందుకు నాకాబందీ

ABN , First Publish Date - 2022-01-28T05:17:29+05:30 IST

అక్రమ రవాణాను అరికట్టేందుకు నాకాబందీ

అక్రమ రవాణాను అరికట్టేందుకు నాకాబందీ
మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

  • వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, జనవరి 27: ఇసుక, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, గుట్కా, గంజాయి, తరలించకుండా, రాత్రి సమయాల్లో దొంగతనాలు, పేకాట, మట్కా తదితర చట్టవ్యతిరేక కార్యకాలపాలను అరికట్టేందుకు నాకాబందీ ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్‌ ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి పేర్కొన్నారు. నెలలో రెండు, మూడు సార్లు నాకాబందీ చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్డెన్‌ సెర్చ్‌ని పోలీసు అధికారు లు ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చని, జిల్లా ప్ర జలందరూ తమ వాహనాల పత్రాలు, గూడ్స్‌ వాహనదారులు వేబిల్లులు దగ్గర ఉంచుకోవా లని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను, డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసేవారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నాకాబం దీ చేసి వికారాబాద్‌ టౌన్‌లో 133, కరన్‌కోట్‌లో 79, బషీరాబాద్‌లో 32, పెద్దేముల్‌లో 30, యాలాల్‌లో 70 చొప్పున మొత్తం 344వాహనాలను సీజ్‌ చేశామని పేర్కొన్నారు. రెండోసారి 429 వాహనాల ను తనిఖీ చేసి 16 వాహనాల ను సీజ్‌ చేశామన్నారు. తాండూరు పరిధిలో 4 చెక్‌ పాయింట్ల వద్ద 295 వాహనాలను తనిఖీ చేశామన్నారు. పరిగి పోలీ్‌సస్టేషన్‌ పరిధి 4 చెక్‌ పాయింట్ల వద్ద 280 వా హనాలను తనిఖీ చేశామని, కొడంగల్‌ పరిఽధిలో 63 అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశామని ఆయన వివరించారు. కార్డెన్‌ సెర్చ్‌లో పట్టుబడిన వాహనాలు, వ్యక్తులపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమాస్పద వ్యక్తులపై తమ పరిధిలోని పోలీస్‌ అ ధికారులకు గానీ, లేదా డయల్‌ 100కు ఫోన్‌చే సి తెలపాలని జిల్లా ఎస్పీ కోరారు.

Updated Date - 2022-01-28T05:17:29+05:30 IST