విష ఫలాలు!

ABN , First Publish Date - 2020-06-01T09:49:24+05:30 IST

పండ్లలో రారా జు ఏదంటే అందరూ ఠక్కున చెప్పే పేరు మామి డి. ఆ పేరు వింటేనే చాలా మందికి నోరూపోతుం ది. వేసవి

విష ఫలాలు!

కాయల పక్వానికి నిషేధిత రసాయనాల వాడకం 

కార్బయిడ్‌, ఇథిలిన్‌ విరివిగా వినియోగం

మామిడి వ్యాపారంలో ఆగని దందా

ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్న వ్యాపారులు

రోగాలు కొని తెచ్చుకుంటున్న ప్రజలు

నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు


కామారెడ్డి,(ఆంధ్రజ్యోతి), మే 31: పండ్లలో రారా జు ఏదంటే అందరూ ఠక్కున చెప్పే పేరు మామి డి. ఆ పేరు వింటేనే చాలా మందికి నోరూపోతుం ది. వేసవి వచ్చిందంటేచాలు మామిడి పండ్లు మా ర్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురూ చూ స్తుంటారు. ప్రజలు ఇంత ఇష్టంగా తినే ఈ పండ్లు ప్రస్తుతం విషంతో సమానంగా మారుతున్నాయి. కృత్రిమ పద్ధతిలో కాయలను రసాయనాలతో మాగ బెట్టడం వల్ల అవి తింటున్న ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. సహజ పద్ధతిన పండిన పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంత మంచి జరుగుతుందో ఈ కృత్రిమ పద్ధతి వల్ల మక్కించిన పండ్లతో అంతకు రెట్టింపు నష్టం జరుగుతుందని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం ముఖ్యం గా మామిడి పండ్ల సీజన్‌. దీనిని అదునుగా చేసు కొని పలువురు వ్యాపారులు మామిడి కాయలను కార్బయిడ్‌, ఇథలిన్‌ కెమికల్స్‌తో పక్వానికి పెట్టి పం డ్లుగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. జిల్లా లోని ప్రూట్‌ మార్కెట్‌, పలు గోదాంలలో నిబం ధనలకు విరుద్ధంగా రసాయనాలను వాడి పండ్లను మక్కబెట్టి ప్రజలకు అమ్ముతున్నప్పటికీ అధికారు లు మాత్రం పట్టించుకోకపోవడంపై పలు విమర్శ లకు తావిస్తోంది.


రోగాలు అధికమే..

కెమికల్స్‌తో మక్కబెట్టే పండ్లు విషతుల్యమవు తున్నాయని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. అవి తి నడం ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. రోగాలు మా త్రం పక్కా వస్తాయని పేర్కొంటున్నారు. అల్సర్‌, కాలేయం, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్‌ వచ్చే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు పే ర్కొంటున్నారు. సహజసిద్ధంగా మాగపెట్టిన పండ్ల ను తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


పర్యవేక్షణ కరువు...

ప్రజారోగ్యాన్ని పట్టించుకునే వారు కరువయ్యా రు. ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు అ టు వైపు కన్నెత్తి చూడడంతో లేదని ప్రజలు ఆరోపి స్తున్నారు. ఫిర్యాదు వస్తే తప్ప దాడులు చేయడం లేదని పేర్కొంటున్నారు. దాడి చేసిన సమయంలో కొన్ని శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపగా వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నా రు. కానీ కాయలను పక్వానికి తెచ్చే ముందే వ్యా పారులకు అవగాహన కల్పించి సహజ పద్ధతిలో మక్కబెట్టేలా చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా బాగుంటుందని ప్రజలు కోరారు.

Updated Date - 2020-06-01T09:49:24+05:30 IST