Car బాగుచేయమని ఇచ్చి.. వారం తర్వాత తిరిగొస్తే షాకింగ్..!

ABN , First Publish Date - 2021-11-28T17:01:36+05:30 IST

రిపేర్‌కొచ్చిన కారును బాగు చేయమని ఇస్తే

Car బాగుచేయమని ఇచ్చి.. వారం తర్వాత తిరిగొస్తే షాకింగ్..!

హైదరాబాద్ సిటీ/తిరుమలగిరి : రిపేర్‌కొచ్చిన కారును బాగు చేయమని ఇస్తే స్ర్కాప్‌కు అమ్ముకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఎస్‌పీ కాలనీ ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డి ఐ10 కారు(టీఎస్‌ 10ఈఈ 2222)కు జహీరాబాద్‌ వద్ద ప్రమాదం జరిగింది. స్వల్పంగా దెబ్బతిన్న కారును తిరుమలగిరిలో సబూ హుండాయ్‌లో రిపేర్‌కు ఇచ్చాడు. కార్‌ రిపేర్‌కు వారం గడువు కావాలని చెప్పారు.


వారం తరువాత వస్తే రిపేర్‌ కాలేదని కారు మొత్తం డ్యామేజ్‌ అయిందని చెప్పడంతో అనుమానం వచ్చిన కారు యజమాని షెడ్‌లోకి వెళ్లి చూశాడు. కారు ఇంజన్‌, ముఖ్యమైన పార్ట్‌లు మార్చినట్టు గుర్తించారు. వెంటనే సంబంధిత వ్యక్తి ప్రశాంత్‌ సబూకు సమాచారం కోసం కాల్‌ చేయగా రెస్పాండ్‌ కాలేదు. తన సోదరుడు రాంరెడ్డి పేరుపై కారు రిజిస్ట్రేషన్‌ ఉన్నదని..తమను మోసం చేసిన సబూ ప్రశాంత్‌ పై చర్యలు తీసుకుని తన కారును రికవరీ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పలు పోలీస్‌ స్టేషన్లలో చీటింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.



Updated Date - 2021-11-28T17:01:36+05:30 IST