గుంటూరు మార్కెట్ సెంటర్‌లో కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-09-19T01:35:59+05:30 IST

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో కారు బీభత్సం

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో కారు బీభత్సం

గుంటూరు: మార్కెట్ సెంటర్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా కారు షాపులోకి దూసుకురావడంతో అక్కడి ఉన్న వారు ప్రమాదం నుంచి తప్పించలేకపోయారు. ఈ ఘటనలో షాపులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో యాజమానితో పాటు మరో ఇద్దరు షాపులో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద దృశ్యాలు షాపులోని సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. కారు యాజమానిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కారు బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు కారు యాజమాని చెప్పినట్లు సమాచారం. 



Updated Date - 2021-09-19T01:35:59+05:30 IST