అంతా చూస్తుండగా బీభత్సం సృష్టించిన కారు.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొని.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-12T03:01:14+05:30 IST

వాహనదారులు ఒక్కోసారి ఇష్టమొచ్చినట్లు నడుపుంటారు. వారి నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతూ ఉంటారు. కొన్ని సార్లు వాహనాలు ఎంత బీభత్సం సృష్టిస్తుంటాయో అందరికీ తెలుసు. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా..

అంతా చూస్తుండగా బీభత్సం సృష్టించిన కారు.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొని.. చివరకు..

వాహనదారులు ఒక్కోసారి ఇష్టమొచ్చినట్లు నడుపుంటారు. వారి నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతూ ఉంటారు. కొన్ని సార్లు వాహనాలు ఎంత బీభత్సం సృష్టిస్తుంటాయో అందరికీ తెలుసు. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోడ్డంతా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. కారు బ్యానెట్‌పై చాలా దూరం వెళ్లి కింద పడ్డ వ్యక్తిని పక్కనున్న వాళ్లు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ వ్యక్తి.. ఆనంద్ విజయ్ మండేలియాగా గుర్తించారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. లా చదువుతున్న ఓ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తల్లి ప్రేమను అర్థం చేసుకోమంటూ.. కొడుక్కి ఈ కుక్క ఎంత బాగా చెప్పింది... మీరే చూడండి..



Updated Date - 2022-02-12T03:01:14+05:30 IST