కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన అమ్మాయి.. తెలిసిన వాడే కదా అని నమ్మకంతో తల్లిదండ్రులు.. చివరికి దారుణం

ABN , First Publish Date - 2021-10-22T12:39:00+05:30 IST

దేశంలో మహిళలను వేధించే నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఛత్తీస్ గడ్‌లో ఈ నేరాల సంఖ్య మరీ ఎక్కువ. తాజాగా ఒక 16 ఏళ్ల అమ్మాయిని అమెకు కారు డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది...

కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన అమ్మాయి.. తెలిసిన వాడే కదా అని నమ్మకంతో తల్లిదండ్రులు.. చివరికి దారుణం

దేశంలో మహిళలను వేధించే నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఛత్తీస్ గడ్‌లో ఈ నేరాల సంఖ్య మరీ ఎక్కువ. తాజాగా ఒక 16 ఏళ్ల అమ్మాయిని అమెకు కారు డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు దర్యాప్తు చేసి ఆ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. సంధ్య(16, పేరు మార్చబడినది) కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఒక డ్రైవింగ్ స్కూల్‌లో చేరింది. అక్కడ నరేశ్(36) అనే వ్యక్తి ఆమెకు కారు డ్రైవింగ్ నేర్పించే శిక్షకుడిగా పరిచయమయ్యాడు. నరేశ్ మొదట సంధ్యతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను అప్పుడప్పుడు షిపింగ్‌కు తీసుకెళ్లేవాడు, ఐస్ క్రీం తినిపించేవాడు. 


సంధ్య అతడిని ఒక గురువుగానే చూసేది. నరేశ్‌ని చాలాసార్లు తన ఇంటికి కూడా తీసుకొచ్చేది. అలా సంధ్య తల్లిదండ్రులకు కూడా నరేశ్ పరిచయమయ్యాడు. వాళ్లు కూడా అతను మంచివాడని నమ్మేవారు. సంధ్యను అతనితో బయటికి ధైర్యంగా పంపేవారు.


ఒకరోజు డ్రైవింగ్ నేర్పించడానికని చెప్పి సంధ్యను నరేశ్ ఊరి బయట తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను తను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె లేకుండా ఉండలేనని అన్నాడు. దీంతో టీనేజ్‌లో ఉన్న సంధ్య అతని మాటలను నమ్మేసింది. అలా అతను ఆ రోజు సంధ్యని లోబర్చుకున్నాడు. ఆ తరువాత నుంచి చాలా సార్లు ఆమెను తన కోరికలు తీర్చమని అడిగేవాడు. కానీ ఆ తరువాత అతను ఒక మృగంలాగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. శృంగారం చేసే సమయంలో సంధ్యను కొట్టేవాడు, పలువిధాలుగా చిత్రహింసలు పెట్టేవాడు. సంధ్య ఈ చిత్రహింసలు భరించలేక అతనితో ఉండనని చెప్పంది. దీంతో నరేశ్ ఆమెపై బలవంతం చేయడం మొదలు పెట్టాడు. సంధ్య ఇక అతడు పెట్టే చిత్రహింసలు సహించకూడదని నిర్ణియించుకొని తల్లిదండ్రులకు విషయం చెప్పింది.


సంధ్య తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో నరేశ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేశ్‌ను అరెస్టు చేసి అతనిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-22T12:39:00+05:30 IST