భూమి ఆకస్మాత్తుగా కుంగిపోతే...!?

ABN , First Publish Date - 2021-06-14T17:24:00+05:30 IST

భూమి ఆకస్మాత్తుగా కుంగిపోతే? నిలిపి ఉంచిన కారును అమాంతం మింగేస్తే?

భూమి ఆకస్మాత్తుగా కుంగిపోతే...!?

భూమి ఆకస్మాత్తుగా కుంగిపోతే? నిలిపి ఉంచిన కారును అమాంతం మింగేస్తే? వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! ఈ ఘటన ముంబైలోని ఘట్కోపర్‌లో చోటుచేసుకుంది. చక్కగా కాంక్రీట్‌ చేసిన ప్రాంతంలో మూడు కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. భారీ వర్షాల వల్ల కావొచ్చు.. ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్దగొయ్యి ఏర్పడింది. ఓ కారు అందులోకి జారిపోయి.. పూర్తిగా మునిగిపోయింది. దానికి అటూ, ఇటూ ఉన్న కార్లు చెక్కుచెదరలేదు. అదృష్టవశాత్తు ఆ కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 

Updated Date - 2021-06-14T17:24:00+05:30 IST