దూసుకొచ్చిన కారు.. ప్రొటెక్షన వాచర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-10-23T04:49:00+05:30 IST

ఆత్మకూరు పట్టణ శివార్లలోని అటవీశాఖ చెక్‌పోస్టులోకి ఓ కారు దూసుకెళ్లడంతో విజయ్‌కుమార్‌ అనే ప్రొటెక్షన వాచర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

దూసుకొచ్చిన కారు.. ప్రొటెక్షన వాచర్‌కు గాయాలు
ఫారెస్ట్‌ చెక్‌పోస్టులోకి దూసుకెళ్లిన కారు


ఆత్మకూరు, అక్టోబరు 22: ఆత్మకూరు పట్టణ శివార్లలోని అటవీశాఖ చెక్‌పోస్టులోకి ఓ కారు దూసుకెళ్లడంతో విజయ్‌కుమార్‌ అనే ప్రొటెక్షన వాచర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి కారు కర్నూలు వైపు వెళ్తోంది. ఈ క్రమంలోనే కేజీరోడ్డు పక్కనే ఉన్న అటవీ చెక్‌పోస్టులోకి దూసుకెళ్లింది. అయితే అక్కడే విధినిర్వహణలో ప్రొటెక్షనవాచర్‌ విజయ్‌కుమార్‌పైకి కారు వెళ్లడంతో అతను కారు కింద ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో ప్రోటెక్షన వాచర్‌ విజయ్‌కుమార్‌ రెండు చేతులు, కాళ్లు, మెడ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు రేంజ్‌ అధికారి బాలసుబ్బయ్య క్షతగాత్రుడిని పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారుణమైన కారు డ్రైవర్‌ ఆత్మకూరు పోలీసుస్టేషనలో లొంగిపోయాడు. 


Updated Date - 2021-10-23T04:49:00+05:30 IST