Advertisement
Advertisement
Abn logo
Advertisement

బస్సును ఢీకొన్న కారు : తమిళనాడువాసి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

నారాయణవనం, అక్టోబరు 17: బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం నారాయణవనం మండలం వెత్తలతడుకు దగ్గర జరిగింది. నారాయణవనం ఎస్‌ఐ ప్రియాంక కథనం మేరకు.. తమిళనాడులోని పొన్నేరుకు చెందిన మురుగన్‌(40)  డ్రైవర్‌ పాండియన్‌(48)తో కలసి కారులో  తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యలో జోరు వర్షం కారణంగా వెత్తలతడుకు వద్ద కారు అదుపుతప్పి  తిరుపతి నుంచి సత్యవేడు వైపు వెళుతున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాండియన్‌ను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందగా, మురుగన్‌ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement