ఎగిరి తోటలో పడిన కారు

ABN , First Publish Date - 2022-04-05T15:35:50+05:30 IST

నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో ఆకాశంలో 200 మీటర్ల ఎత్తుకు ఎగిరిన కారు తేయాకు తోటలో పడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు

ఎగిరి తోటలో పడిన కారు

పెరంబూర్‌(చెన్నై): నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో ఆకాశంలో 200 మీటర్ల ఎత్తుకు ఎగిరిన కారు తేయాకు తోటలో పడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. తుదూర్‌మట్టం ప్రాంతం పరిసరాల్లో ఉన్న తేయాకు తోటల్లో ఆదివారం యధావిధిగా కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భయంకర శబ్దంతో ఆకాశంలో సుమారు 200 మీటర్ల ఎత్తు ఎగిరిన కారు తేయాకు తోటలో పడడం చూసి భయభ్రాంతులైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొద్దిసేపటి అనంతరం చుట్టుపక్కల వారు కారు వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రాంతంలో 10 రోజులుగా, నటుడు నాగార్జున నటిస్తున్న తెలుగు చిత్రం షూటింగ్‌ జరుగుతోందని, అందులో భాగంగా పోరాట సన్నివేశాల్లో కారు ఆకాశంలో ఎగిరి తోటలో పడే సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-04-05T15:35:50+05:30 IST