మహేశ్వరంలో ‘కారు చిచ్చు’

ABN , First Publish Date - 2022-07-06T08:31:44+05:30 IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎ్‌సలో ఇప్పటివరకు ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

మహేశ్వరంలో ‘కారు చిచ్చు’

  • మంత్రి సబితారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఫైర్‌
  • చెరువుల కబ్జాలను మంత్రే ప్రోత్సహిస్తున్నారు
  • సబిత వైఖరి వల్లే బడంగ్‌పేట మేయర్‌ పార్టీ వీడారు
  • వీటన్నింటిపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని తీగల వెల్లడి
  • భూకబ్జాలు జరిగితే ముఖ్యమంత్రే..
  • తనపై చర్యలు తీసుకుంటారన్న సబిత
  • తీగల కాంగ్రెస్‌లో చేరతారంటూ ఊహాగానాలు


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎ్‌సలో ఇప్పటివరకు ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డిపై టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సబితారెడ్డి ప్రోత్సాహంతో భూ కబ్జాలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే పద్ధతి ప్రకారం ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నార ని ఆరోపించారు. చెరువుల పరిరక్షణ సమితి పిలుపు మేరకు మంగళవారం ఆయన బాలాపూర్‌ చౌరస్తా సమీపంలో ఉన్న మంత్రాల చెరువును సందర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు, చెరువుల సంరక్షణ కోసం అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని, ప్రాణత్యాగానికీ వెనుకాడనని హెచ్చరించారు. సబితారెడ్డి వైఖరి కారణంగానే బడంగ్‌పేట మేయర్‌ పారిజాతారెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడారని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే  మ హేశ్వరం ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి మాజీ ఎ మ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కొన్నాళ్లుగా పొసగడం లేదు. 


కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సబితారెడ్డి టీఆర్‌ఎ్‌సలో  చేరడాన్ని  మొదటి నుంచీ తీగల వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ని బుజ్జగించేందుకు టీ ఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఆయన కోడలైన తీగల అనితారెడ్డిని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో ఆయన కొంత మెత్తబడ్డారు. అయితే మంత్రి సబిత, తీగల మధ్య సఖ్యత కుదరలేదు.కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్న తీగల కృష్ణారెడ్డి ఒక్కసారిపై మంత్రిపై విరుచుకుపడడం టీఆర్‌ఎ్‌సలోకలకలం రే కెత్తించింది. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన బయటకు వెళ్లేందుకే నిర్ణయించుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తీగల తన సీటు విషయం తే ల్చాలని పార్టీ నాయకత్వంపై కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. లే దం టే తన దారి తాను చూసుకుంటానని సంకేతాలు పంపారు. మరోవైపు తీగలకు కాంగ్రెస్‌ పార్టీ గాలం వేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మంత్రికేటీఆర్‌ మాట్లాడారు.  ఎ మ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే తీగల ఎమ్మె ల్యే సీటు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

అది పెద్ద ఇష్యూనే కాదు: సబిత

షాద్‌నగర్‌: ‘‘నాపై కృష్ణన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద ఇష్యూనే కాదు. ఆయన్ను ఎవరో తప్పుదారి పట్టించి ఉంటారు. ఆయనతో కూర్చుని మాట్లాడుకుంటాం’’ అని మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. ఆమె పై విధంగా స్పందించారు. తాను భూ కబ్జాలకు పాల్పడితే ముఖ్యమంత్రి విచారణ చేపట్టి తనపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.    


తీగల దారెటు?

టీఆర్‌ఎస్‌ నుంచి మహేశ్వరం టికెట్‌ మంత్రి సబితారెడ్డికే ఇచ్చే అవకాశాలు ఉండడంతో తీగల కృష్ణారెడ్డి తనదారి తాను చూసుకోవాలని దా దాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన కాం గ్రెస్‌, బీజేపీల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కాం గ్రెస్‌ నేతలు తీగలతో చర్చలు జరిపినట్లు ప్ర చారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే ఆ పార్టీలో చేరతారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈనెల 11వ తేదీన ఆయన కాంగ్రె్‌సలో చేరుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కానీ వీటిని తీగల కృష్ణారెడ్డి ఖండిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉండే పోరాడతానని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-06T08:31:44+05:30 IST