Abn logo
Sep 28 2021 @ 21:20PM

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ మారతారట!

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ రాజీనామా చేసిన అనంతరమే ఆయనకి నిలకడ ఉండదంటూ విరుచుకుపడ్డ కెప్టెన్.. సిద్ధూకి కాంగ్రెస్‌లో ఉండే ఉద్దేశమే లేదని విమర్శలు గుప్పించారు. మంగళవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా సిద్ధూపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


‘‘కాంగ్రెస్ పార్టీ పంజాబ్ శాఖకు అధ్యక్షుడిగా చేసిన రెండు నెలలకే నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీని వీడారు. వాస్తవానికి ఆయన వేరే పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేలోపు అంత పని జరుగుతుంది’’ అని కెప్టెన్ ట్వీట్ చేశారు. కాగా దీనికి ముందు ఆయన చేసిన ట్వీట్‌లో ‘‘సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పాను. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని మరోసారి రుజువైంది’’ అంటూ ఘాటుగా స్పందించారు.


ఇదిలా ఉంటే సిద్ధూకి మద్దతుగా పంజాబ్‌లో వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రి రజియా సుల్తానా పంజాబ్ కాంగ్రెస్ కమిటీ ట్రెజరర్ గుల్జర్ ఇందర్ తొలుత రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేసిన కొద్ది సమయానికే పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యోగిందర్ దింగ్రా రాజీనామా చేశారు. అయితే వీరెవరూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కేవలం పార్టీలో ఉన్న పదవులకు మాత్రమే రాజీనామా చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండిImage Caption