హాకీ చాంపియన్‌కూ తప్పని కట్నం వేధింపులు

ABN , First Publish Date - 2020-02-21T10:04:12+05:30 IST

దేశానికి మూడుసార్లు బంగారు పతకం అందించిన మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ వైఖొమ్‌ సూరజ్‌ లతాదేవి.. తన భర్త శాంతాసింగ్‌పై గృహ హింస కేసు పెట్టింది.

హాకీ చాంపియన్‌కూ తప్పని కట్నం వేధింపులు

భర్తపై సూరజ్‌ లతాదేవి గృహ హింస కేసు

ఇంఫాల్‌: దేశానికి మూడుసార్లు బంగారు పతకం అందించిన మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ వైఖొమ్‌ సూరజ్‌ లతాదేవి.. తన భర్త శాంతాసింగ్‌పై గృహ హింస కేసు పెట్టింది. కట్నం కోసం భర్త తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరికీ 2005లో వివాహమైంది. ‘నేను సాధించిన పతకాలు, నా ఫొటోలను పెళ్లిరోజే ఆయన ఎగతాళి చేశారు. తప్పుడు పద్ధతుల్లో అర్జున అవార్డు తెచ్చుకున్నావంటూ నిందించేవారు. గతేడాది నవంబరులో పంజాబ్‌లోని కపుర్తలాలో ఓ టోర్నీ నిర్వహణలో ఉండగా మద్యం తాగి వచ్చి దాడి చేశాడు. ప్రవర్తన మారుతుందేమోనని వేచి చూశా. ఓపిక నశించడంతో ఫిర్యాదు చేయక తప్పలేదు’ అని లతాదేవి తెలిపింది. లతాదేవి సారథ్యంలో భారత జట్టు 2002 కామన్వెల్త్‌, 2003 ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌, 2004 ఆసియా కప్‌లో స్వర్ణాలు గెల్చుకుంది. 2002 కామన్వెల్త్‌ పతకం స్ఫూర్తిగానే గతంలో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘చక్‌ దె ఇండియా’ తెరకెక్కింది.


Updated Date - 2020-02-21T10:04:12+05:30 IST