విండీస్‌పై కివీస్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-08-12T09:30:11+05:30 IST

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (47) రాణించడంతో.. వెస్టిండీస్‌తో జరిగిన వర్ష ప్రభావిత తొలి టీ20లో న్యూజిలాండ్‌ 13 పరుగుల తేడాతో నెగ్గింది.

విండీస్‌పై కివీస్‌ గెలుపు

కింగ్‌స్టన్‌: కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (47) రాణించడంతో.. వెస్టిండీస్‌తో జరిగిన వర్ష ప్రభావిత తొలి టీ20లో న్యూజిలాండ్‌ 13 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టీ20ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 185/5 స్కోరు చేసింది. కాన్వే (43), నీషమ్‌ (33 నాటౌట్‌) సత్తా చాటారు. ఓడియన్‌ స్మిత్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో విండీస్‌ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 172 పరుగుల మాత్రమే చేసింది. బ్రూక్స్‌ (42), షెప్పర్డ్‌ (31 నాటౌట్‌), ఓడియన్‌ స్మిత్‌ (27 నాటౌట్‌) పోరాడినా ఫలితం దక్కలేదు. 

Updated Date - 2022-08-12T09:30:11+05:30 IST