Abn logo
Oct 20 2020 @ 04:31AM

ఖోఖో నేపథ్యంలో ‘సారథి’

Kaakateeya

నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సారథి’. ఓ షెడ్యూల్‌ మినహా సినిమా పూర్తయింది. ఈ నెల 25న ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు. దర్శకుడు జాకట రమేశ్‌ మాట్లాడుతూ ‘‘ఖోఖో నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రమిది. తారకరత్న వైవిధ్యమైన లుక్‌లో కనిపిస్తారు. కరోనా కాలంలోనూ ఆయన మాకెంతో సహకరించి ఇటీవల కడపలో చిత్రీకరణ చేశారు. దాంతో మెజారిటీ సినిమా పూర్తయింది. త్వరలో మిగతా చిత్రీకరణ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి పి. నరేశ్‌ యాదవ్‌, వై.ఎస్‌. కృష్ణమూర్తి, పి. సిద్ధేశ్వరరావు నిర్మాతలు.  ఫ


Advertisement
Advertisement