Abn logo
Sep 28 2021 @ 16:07PM

కెప్టెన్ ఢిల్లీ పర్యటనకు కారణమిదేనట...

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లడంపై వస్తున్న ఊహాగానాలను ఆయన మీడియా అడ్వయిజర్ రవీన్ థుక్రాల్ కొట్టివేశారు. కెప్టెన్ ఢిల్లీ పర్యటన వెనుక బీజేపీలో చేరే ఉద్దేశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి ఊహాగానాలు వెల్లువెత్తాయి. తన పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను రవీన్ థుక్రాల్ తోసిపుచ్చారు. వ్యక్తిగత పర్యటన కోసమే కెప్టెన్ ఢిల్లీ వెళ్లారని, తన సన్నిహితులను కలుసుకుంటారని, కొత్త సీఎం కోసం కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేయనున్నారని తెలిపారు. అనవసర ఊహాగానాలకు తావేలేదని ఆయన వివరణ ఇచ్చారు.