Abn logo
Sep 28 2021 @ 15:59PM

నేను ముందే చెప్పాగా!.. సిద్ధూ రాజీనామాపై కెప్టెన్ షాకింగ్ ట్వీట్

న్యూఢిల్లీ: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు. కెప్టెన్ నేడు బీజేపీ పెద్దలను ఢిల్లీలో కలవబోతున్నారని ప్రచారం జరిగింది. అమరీందర్ బీజేపీలో చేరతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతలోనే సిద్ధూ పంజాబ్ పీసీసీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ సిద్ధూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని అమరీందర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. 



ఇవి కూడా చదవండిImage Caption