రాజధానిలో కొలువైన ‘శ్రీవారు’

ABN , First Publish Date - 2022-06-10T02:21:47+05:30 IST

రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవారు కొలువయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన

రాజధానిలో కొలువైన ‘శ్రీవారు’

విజయవాడ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవారు కొలువయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం సంప్రోక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారని షెడ్యూల్‌ ఖరారు చేశారు. చివరిని నిమిషంలో ఆయన కార్యక్రమానికి హాజరుకాలేదు. గవర్నరు హరించదన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతోపాటు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, సాత్వానందేంద్ర స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 25 ఎకరాల్లో రూ.40కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం అతిథులు స్వామి వారి మొదటి దర్శనం చేసుకున్నారు. కొంతసేపు ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు రాజధాని ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో భక్తులో వచ్చారు. 

Updated Date - 2022-06-10T02:21:47+05:30 IST