తిరుపతి: ఏపీకి రాజధాని లేని పరిస్థితిని కల్పించారని ఎంపీ రఘురామకృష్ణరాజు దుయ్యబట్టారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడారు. రాజధాని కోసం అమరావతి రైతుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు నేతలు హాజరయ్యారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.